IND Vs AFG : Jasprit Bumrah ఈ అరుదైన ఫీట్‌ సాదిస్తాడా ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-03

Views 111

T20 World Cup 2021: Team India Fast bowler Jasprit Bumrah three wickets away from massive record in T20Is.
#T20WorldCup
#JaspritBumrah
#INDVsAFG
#ViratKohli
#YuzvendraChahal
#RashidKhan
#MohammedNabi
#RavichandranAshwin
#HardikPandya
#ShakibAlHasan
#LasithMalinga
#Cricket
#TeamIndia

ఘోర పరాజయాలతో టీ20 ప్రపంచకప్ 2021 సెమీ ఫైనల్‌ అవకాశాలను దాదాపు దూరం చేసుకున్న భారత జట్టు.. నేడు అఫ్గానిస్థాన్‌తో తలపడనున్నది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఖంగుతిన్న టీమిండియా.. రెండో పోరులో న్యూజిలాండ్‌ చేతిలో అవమానకర ఓటమి ఎదుర్కొంది. ఇక గ్రూప్‌-2లో మిగిలిన మూడు మ్యాచ్‌లు నెగ్గినా.. ముందడుగు వేయడం కష్టమైన తరుణంలో మరికొద్దిసేపట్లో నబీ సేనను ఎదుర్కోనుంది. అయితే టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో మూడు వికెట్లు పడగొడితే టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచులో బుమ్రా ఈ అరుదైన ఫీట్‌ను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form