T20 World Cup 2021 : Ahead of the high-octane and eagerly anticipated India-Pak match in the ICC T20 World Cup 2021, official broadcasters Star Sports have brought back the iconic ‘Mauka Mauka’ campaign with an interesting twist.
#T20WorldCup2021
#IndvsPak
#Cricket
#MaukaMaukaAdd
#ViratKohli
#BabarAzam
#RohitSharma
#TeamIndia
యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021కు సమయం ఆసన్నమవుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు ఆరంభం కాగా.. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. దాయాదుల మధ్య చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్, పాక్ తలపడడం ఇప్పుడే. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనిని మరింత పెంచింది మెగా టోర్నీ ప్రసరదారు సంస్థ స్టార్‌స్పోర్ట్స్. ఓ ఫన్నీ వీడియోతో స్టార్‌స్పోర్ట్స్ అభిమానులముందుకొచ్చింది.