G7 Meet On Afghanistan ఏ క్షణాన ఏ తుపాకీ ఎక్కుపెడుతుందో US కు Taliban వార్నింగ్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-24

Views 1.5K

Anti-Taliban Forces Retake Three Northern Afghan Districts. Meanwhile British Prime Minister Boris Johnson called for the virtual meeting, in the wake of the Taliban's swift takeover of Afghanistan.US President Joe Biden to meet G7 leaders today to discuss Afghanistan
#Taliban
#G7MeetOnAfghanistan
#Panjshir
#USPresidentJoeBiden
#Afghanistan
#UStroopswithdrawal
#KabulAirport
#India

ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఓవైపు తాలిబన్ల అరాచకాలు... మరోవైపు సాయుధ తిరుగుబాటు... ఈ పరిణామాలు చివరకు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన నెలకొంది. తాలిబన్ల రాజ్యాన్ని కూలదోసేందుకు ఎక్కడికక్కడ ప్రజా సాయుధ బృందాలు రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో యాంటీ తాలిబన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ అందరబీ నేతృత్వంలో జరిపిన తిరుగుబాటులో మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి విముక్తి చేయగలిగారు. అయితే 24 గంటలు గడవక ముందే తాలిబన్లు తిరిగి ఆ 3 జిల్లాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటివరకూ తమ ఆధీనంలోకి రాని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్‌షీర్‌ను కూడా ఆక్రమిస్తే... ప్రజా తిరుగుబాటును పూర్తిగా అణచివేయొచ్చునని తాలిబన్లు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆ ప్రావిన్స్ వైపు పదుల సంఖ్యలో వాహనాల్లో వందలాది తాలిబన్లు బయలుదేరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS