Former India cricketer Farokh Engineer recalled his sledging battle with opposition teams, saying India earned their respect once they started giving it back with their performances on the field.
#IndvsEng2021
#ViratKohli
#FarokhEngineer
#RohitSharma
#RishabPant
#MohammedSiraj
#JaspritBumrah
#Cricket
#TeamIndia
మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కనబరిచే దూకుడు తనకు ఇష్టమని మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఫరూక్ ఇంజనీర్ అన్నాడు. అయితే కోహ్లీ తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచించాడు. అనవసర విషయాలకు వెళ్లి పరిస్థితులు చేయిదాటిపోయేలా చేసుకోవద్దన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లను ఇంగ్లండ్ ప్లేయర్స్ కవ్వించడం.. వారు కూడా అదే స్థాయిలో ధీటుగా బదులిచ్చారు. మరింత కసిగా ఆడి చిరస్మరణీయ విజయాన్నందుకున్నాడు. ఈ క్రమంలోనే మైదానంలో జరిగిన సంఘటనలపై స్పందించిన ఫరూక్ ఇంజినీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.