Govt Panel Backs Mixing Covishield, Covaxin Doses | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-30

Views 2.2K

The Subject Expert Committee (SEC) of the Central Drugs Standard Control Organisation (CDSCO) has recommended mixing vaccine doses of Covishield, Covaxin.

#CovishieldCovaxinMixDose
#CDSCO
#mixingvaccinedoses
#COVID19Vaccine
#Covid Strains
#GovtPanel


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్ డోసులు ఇవ్వడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్ సీఓ)కు సంబంధించిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) గురువారం కరోనా వ్యాక్సిన్ డోసులు మిక్సింగ్ ఇవ్వడంపై కీలక చర్చ జరిపింది. ఈ భేటీలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కలిపి ఇచ్చేందుకు సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సానుకూలతను ప్రకటించినట్లు సమాచారం. అంతేగాక, వెళ్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(సీఎంసీ)కి కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఈ మేరకు సదరు కాలేజీ ఇప్పటికే ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS