Virat Kohli hints at changes in India Test side after WTC final loss
#ViratKohli
#Pujara
#Teamindia
#Indiancricketteam
టీమ్ కాంబినేషన్‌పై వెంటనే సమీక్షించుకుంటామని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాగా ఆడగలిగే సరైన వైఖరి గల ఆటగాళ్లను ఎంపిక చేస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బుధవారం ముగిసిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసింది. ఈ ఓటమి అనంతరం వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోహ్లీ.. తప్పిదాలను సవరించుకొని బెస్ట్ టీమ్‌ను రెడీ చేస్తామన్నాడు.