Viral: Doctor Refuses To Wear Mask At Supermarket మాస్కు మూర్ఖపు నిబంధన...! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-20

Views 82

Mangaluru (Karnataka): In a viral video, doctor refused to wear mask at a supermarket in Mangaluru. He was seen arguing with shopkeeper in the video. A case has been registered against him. Mangaluru City CP, Shashi Kumar said
#doctorrefusestowearmask
#viralvideo
#Covid19
#CovidVaccine
#Doctor
#Mask
#Caughtoncam
#Mangaluru
#Karnataka
#supermarket

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అవసరమైతే ఇంట్లో కూడా మాస్కులు ధరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు,వైద్యులు డబుల్ మాస్కు ధరించాల్సిన అవసరం గురించి పదే పదే చెబుతున్నారు. అయినా సరే కొంతమంది
తీరులో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా కర్ణాటకలో ఓ వ్యక్తి ముఖానికి మాస్కు ధరించకుండానే ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే... ఇటీవల కర్ణాటకలోని మంగళూరులో ఓ వైద్యుడు మాస్కు ధరించకుండానే షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. అక్కడ బిల్లింగ్ చేయిస్తున్న సమయంలో తోటి కస్టమర్.. మాస్కు పెట్టుకోవాలని ఆ పెద్దాయనకు సూచించాడు. అక్కడే ఉన్న స్టోర్ మేనేజర్ కూడా మాస్కు ధరించాల్సిందిగా సూచించాడు. కానీ ఆయన మాత్రం మాస్కు ధరించేందుకు నిరాకరించాడు. పైగా అదొక మూర్ఖపు నిబంధన అంటూ కొట్టిపారేశాడు.

Share This Video


Download

  
Report form