Brazil President Bolsonaro thanks PM Modi for COVID-19 vaccines
#India
#CovidVaccine
#Brazil
#PmModi
#Who
బ్రెజిల్‌తో పాటు మొరాకోకు కూడా భారత్ శుక్రవారం 20 లక్షల డోసుల్ని ప్రత్యేక విమానంలో పంపింది. బుధవారం నుంచి వివిధ దేశాలకు భారత్ కొవిడ్ టీకాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒప్పంద ప్రాతిపదికన సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మొరాకో, బంగ్లాదేశ్, మయన్మార్‌కు కొవిడ్ టీకాల సరఫరా చేపడుతున్నట్లు శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. మరోవైపు కొవిడ్ టీకాలను పంపించినందుకుగానూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దక్షిణాసియాలోని పలు దేశాలకు కొవిడ్-19 టీకాలను అందించిన భారత ఔదార్యాన్ని అమెరికాలోని జో బైడెన్ సర్కార్ ప్రశంసించింది.