Anushka Sharma Performs Shirshasana Effortlessly With Her Baby Bump
#ViratKohli
#AnushkaSharma
#Virat
#Indvsaus2020
#Indiavsaustralia
బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా కుదుర్చుకున్న ప్రాజెక్టుల్ని ఆమె దాదాపు పూర్తి చేశారు. మెటర్నటీ బ్రేక్‌కు ముందే వీలైనంత వరకు షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి కసరత్తులు కూడా చేశారు. విరాట్ కోహ్లీ ఆమెకు అండగా ఉన్నాడు. అయితే అనుష్క ఆరు నెలల గర్భంతోనూ శీర్షాసనం వేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.