Former India cricketer Sanjay Manjrekar believes India will have to find a batsman like Suresh Raina And Yuvraj Singh.
#SanjayManjrekar
#TalkCricketWithSanjay
#YuvrajSingh
#SureshRaina
#KLrahul
#viratkohli
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టోర్నీలు రద్దవ్వడం.. నగరాలన్నీ లాక్ డౌన్ కావడంతో స్టార్ క్రికెటర్లు, కామెంటేటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. స్వియ నిర్బంధంలో ఉంటూ కరోనాపై పోరాడాలని అభిమానులకు సూచిస్తున్నారు. అయితే చాలా మంది క్రికెటర్లు ఈ ఖాళీ సమయంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ కూడా అభిమానులతో ట్విటర్ వేదికగా చిట్‌చాట్ నిర్వహించాడు.ఈ సందర్బంగా ఓ అభిమాని వన్డేల్లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ సరిపోతాడా? లేక ఇతర బ్యాట్స్‌మన్ అవసరమా? అని ప్రశ్నించాడు. దీనికి ఈ ప్రముఖ కామెంటేటర్ సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతానికి రాహులే ఐదో స్థానానికి సరైనవాడు. కానీ యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తరహా బ్యాట్స్‌మెన్ కోసం కూడా మనం వెతుకుతూనే ఉండాలి. ఎందుకంటే రాహుల్ టాపార్డర్‌కు వెళ్లినప్పుడు వీరి అవసరం ఉంటుంది.'అని బదులిచ్చాడు.