Manish Pandey Made A Century In Syed Mushtaq Ali Trophy || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-13

Views 382

Deepak Chahar, Manish Pandey light up Syed Mushtaq Ali Trophy.Mayank Mishra claims hat-trick in Uttarakhand's big win over Goa.
#ManishPandey
#ManishPandeyBatting
#SyedMushtaqAliTrophy
#DeepakChahar
#DeepakChaharHattrick
#RajasthanvsVidarbha
#Teamindia
#uttarakhandvsgoa
#Mayankmishra
#devduttpadikkal


వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే (54 బంతుల్లో 129 నాటౌట్‌; 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీలో కర్ణాటక మూడో విజయం నమోదు చేసింది. సర్వీసెస్‌తో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (43 బంతుల్లో 75; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా వీరవిహారం చేశాడు. మనీశ్‌ పాండే, దేవదత్‌ రెండో వికెట్‌కు కేవలం 13.5 ఓవర్లలో ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడిపోయింది. కర్ణాటక బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌ 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

Share This Video


Download

  
Report form