IPL 2020 : KL Rahul To Take Over Captaincy After Ravichandran Ashwin || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-07

Views 61

Kings XI Punjab and former skipper Ravichandran Ashwin have amicably decided to part ways, franchise co-owner Ness Wadia said on Wednesday. KL Rahul is expected to lead the side after Ashwin’s departure.
#ipl2020
#klrahul
#kingsxipunjab
#ravichandranashwin
#delhicapitals
#nesswadia
#ChrisGayle
#DavidMiller

టీమిండియా సీనియర్ స్పిన్నర్,కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. చాలా రోజులుగా అశ్విన్ ఢిల్లీ జట్టులోకి వెళుతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం ఢిల్లీ జట్టులోకి అశ్విన్ చేరబోతున్నట్టు పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా బుధవారం తెలిపారు.అశ్విన్ ఢిల్లీ జట్టుకు వెళుతుండడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. పంజాబ్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమీ లాంటి వారు ఉన్నా.. జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. గత కొన్ని సీజన్‌లుగా రాహుల్ పంజాబ్ జట్టు తరపునే ఆడడం కూడా అతనికి కలిసొచ్చే అంశం. అధికారిక ప్రకటన రాకున్నా.. సహ యజమాని నెస్ వాడియా రాహుల్ నాయకత్వం వైపే మొగ్గుగా ఉన్నాడట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS