All South Africa could manage this morning was 12 deliveries as Shahbaz Nadeem struck twice on successive deliveries to get rid of Theunis de Bruyn and Lungi Ngidi in the second over of the morning. A commanding victory for Virat Kohli and company as they have whitewashed South Africa for the first ever time in a Test series.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#RanchiTest
#ShahbazNadeem
#TheunisdeBruyn
#LungiNgidi
#teamindia
#viratkohli
#fafduplessis
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చివరిదైన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలి రెండు టెస్టులను సునాయాసంగా గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో సైతం అదే జోష్ కనబరిచి సిరీస్‌ను 3-0తేడాతో కైవసం చేసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా నయా రికార్డును సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా, స్వదేశంలో జరిగే టెస్టుల విషయంలో టీమిండియాదే పైచేయిగా ఉంది. కేవలం భారత్‌లో సఫారీలతో ఒక్క సిరీస్‌ను మాత్రమే టీమిండియా కోల్పోయింది. కాకపోతే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇంకా టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈ సిరీస్ ముందు వరకూ దక్షిణాఫ్రికాపై ఏ టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయలేదు. దాన్ని ఇప్పుడు విరాట్ గ్యాంగ్ సాధించింది. ఇక దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం.