India chief selector MSK Prasad has said he is worried with KL Rahul's poor form in Test cricket and indicated it might be time for Rohit Sharma to step up as an opener in the five-day format as well.
#klrahul
#rohitsharma
#mskprasad
#BCCI
#mayankaagarwal
#hanumavihari
#ganguly
టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా వస్తున్న కేఎల్ రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ స్థానంలో 'హిట్‌మ్యాన్' ఓపెనర్ రోహిత్ శర్మను తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఓపెనర్‌గా రోహిత్‌ను తీసుకునే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా ఎమ్మెస్కే పైవిధంగా స్పందించారు. సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ విషయం గురించి మాట్లాడతామని కూడా ఆయన తెలిపారు.తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కాలేదు. త్వరలో జరిగే టీమ్ సెలక్షన్ సమావేశాల్లో రోహిత్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే ప్రతిపాదనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం' అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ టూర్‌లో ఓపెనర్‌గా రాహుల్ పేలవమైన ప్రదర్శన చేయడంతో రోహిత్‌వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతున్నట్టు స్పష్టం అయింది.