ICC Cricket World Cup 2019:After enduring their first defeat at the ongoing World Cup on Sunday, Team India would like to recalculate their winning combination in their penultimate league clash against Bangladesh.
#icccricketworldcup2019
#indvban
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia
ఇంగ్లండ్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ప‌్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టు తొలి పరాజయాన్ని అందుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో- జట్టులో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న కేదార్ జాదవ్‌ను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కేదార్ జాదవ్ స్థానంలో ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.