nithiin teaming up with versatile director chandrasekhar yeleti movie launched
#Nithiin
#Nithiin28
#ChandrasekharYeleti
#PriyaPrakashVarrier
#Rakulpreetsingh
#Tollywood
#youthstar
#mmkeeravani
యూత్ స్టార్ నితిన్ హీరోగా, అభిరుచి గల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా జరిగాయి.తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో అందరినీ అలరించే చిత్రాలను తెరకెక్కిస్తున్న భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా పి. వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్‌కొట్టారు.