Priya Prakash Varrier charging more than Bollywood stars for social media.She is a recent Sensation on internet.Her wink Anchors So Many youth Hearts...
ప్రియా ప్రకాష్ వారియర్..కేవలం ఒక్క వీడియోతో దేశం మొత్తం స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది ఈ భామ. ఇప్పుడు యువత మొత్తం ప్రియా జపం చేస్తోంది. ఓరు ఆదార్ లవ్ చిత్రంలోని ఓ పాటతో ప్రియా ఫేమస్ అయిపోయింది. కుర్ర హృదయాలకు కళ్లెం వేసే విధంగా ఉన్న ఆమె హావభావాలు ఇంటర్ నెట్ లో సెన్సేషన్ గా మారిపోయాయి. ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ కన్నా కాస్ట్లీ అయిపోయిందనే వార్త సంచలనంగా మారింది.
ఒరు ఆదార్ లవ్ చిత్రంలోని వీడియో ప్రియా ప్రకాష్ వారియర్ జాతకాన్ని మార్చేసింది. ఓవర్ నైట్ లో ఆమె సెలబ్రిటీగా అవతరించింది.
ఒరు ఆదార్ లవ్ చిత్రంలోని పాట తమ మనోభావాలని దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ కొందరు ప్రియా వారియర్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కేసులు, విమర్శలతో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ప్రియా వారియర్ సుప్రీ౦ కోర్టుని ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో ప్రియాకు ఊరట లభించిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రియా వారియర్ గురించి వస్తున్న వార్తలు షాక్ కి గురిచేస్తున్నాయి. ప్రియా వారియర్ ఎంత పెద్ద సెలెబ్రటీగా మారిపోయిందో ఆమె పారితోషకం కూడా అదే రేంజ్ లో పెరిగిందని అంటున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో ప్రియా పెట్టె పోస్ట్ లకు కూడా రూ 8 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటోందని వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియా పోస్ట్ లకు ప్రియా అందుకుంటున్న ఈ పారితోషకం బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు అందుకుంటున్న మొత్తానికన్నా ఎక్కువని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఏళ్ల తరబడి శ్రమిస్తే దక్కిన క్రేజ్ ఈ భామకు కేవలం కొద్దిరోజుల్లో సొంతం అయిపోయింది.