Video Link: https://telugu.mykhel.com/cricket/icc-world-cup-2019-time-away-helped-me-reflect-on-my-game-says-kl-rahul-020863.html
ICC Cricket World Cup 2019:Virat Kohli and the Indian management would breathe a huge sigh of relief. KL Rahul registered a majestic 108 in just 99 deliveries in the warm-up match against Bangladesh in Cardiff and at least for now settled the debate for the Number 4 position.
#iccworldcup2019
#klrahul
#msdhoni
#viratkohli
#ambatirayudu
#vijayshankar
#kedarjadav
#cricket
#teamindia
కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేఎల్ రాహుల్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. నిషేధం కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరిస్‌లకు దూరమైన కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ధీటుగా మంగళవారం కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో వరల్డ్‌కప్‌లో NO.4 స్థానంలో కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తుంది.