ICC Cricket World Cup 2019:Virat Kohli and the Indian management would breathe a huge sigh of relief. KL Rahul registered a majestic 108 in just 99 deliveries in the warm-up match against Bangladesh in Cardiff and at least for now settled the debate for the Number 4 position.
#iccworldcup2019
#klrahul
#ambatirayudu
#vijayshankar
#viratkohli
#msdhoni
#kedarjadav
#cricket
#teamindia
గత కొంత కాలంగా భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌లోని నాలుగో స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో టీమిండియా చాలా మందినే ప్రయోగించింది. మనీష్ పాండే, అంబటి రాయుడు, దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇలా చాలా మందినే పరీక్షించారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు తేజం అంబటి రాయుడు ఆ స్థానంలో కుదురుకున్నాడు.
ఐపీఎల్-12కు ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో రాయుడు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్-12లో చెన్నై తరపున కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే సమయంలో పంజాబ్ తరపున పరుగుల వరద పారిస్తూ కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్ జట్టు నాలుగో స్థానంలో విజయ్ శంకర్, కేఎల్ రాహుల్‌లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. దినేష్ కార్తీక్ కూడా వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. ఈ ముగ్గురు రేసులో ఉన్నా.. నం.4లో ఎవరు ఆడుతారో అని కెప్టెన్ కోహ్లీ, కోచ్ స్పష్టత ఇవ్వలేదు.