Opening Ceremony For ICC World Cup 2019 Set To Be The Biggest Ever!!

Oneindia Telugu 2019-05-29

Views 238

The opening ceremony of the much-awaited ICC World Cup 2019 is going to be a lavish ceremony. The ceremony is set to take place on The Mall, the famous road in the City of Westminster, central London. The road is situated between Buckingham Palace at its western end and Trafalgar Square via Admiralty Arch to the east
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#celebrations
#icc
#ecb
#worldcupcelebrations

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు బుధవారం జరుగనున్నాయి. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు లండన్‌లోని మాల్‌ రోడ్‌లో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను ఐసీసీ-ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 12వ క్రికెట్‌ ప్రపంచకప్‌ ప్రారంభోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది.

క్రికెట్, సంగీతం కలబోతగా ఈ ప్రోగ్రామ్‌ జరగనుంది. సుమారు గంటసేపు కార్యక్రమం జరుగుతుందని సమాచారం. అయితే ఇందులో ఎటువంటి ప్రదర్శనలు ఉంటాయో మాత్రం తెలియరాలేదు. ప్రారంభ వేడుకలను ప్రత్యక్షంగా నాలుగు వేల మంది వీక్షించనున్నారు. వీరందరికి బ్యాలెట్‌ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్లెవరూ ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. అయితే మాజీ ఆటగాళ్లు, మరికొందరు ప్రత్యేక అతిథులు పాల్గొంటారు. ఈ వేడుకలు పలు చానెళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్నాయి.

Share This Video


Download

  
Report form