People Star R Naranayan Murthy's Latest movie is Marketlo Prajaswamyam. This movies audio function held in hyderaad. Chiranjeevi is the Chief guest for this event. Koratala Siva and Suddala Ashok Teja are the guest. Chiranjeevi praises R Narayana Murthy's commitment in his career.
#rnarayanamurthy
#chiranjeevi
#marketloprajaswamyam
#koratalasiva
#tollywood
#latesttelugumovies
#movienews
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తాజా చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం. తాను నమ్మిన, కట్టుబడిన సిద్దాంతానికి లోబడి చిత్రాలను నిర్మిస్తున్న ఆయన తన సినిమా ఆడియో ఫంక్షన్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ..ఇటీవల సైరా నర్సింహారెడ్డి షూటింగ్‌కు వచ్చి నా సినిమా ఆడియో ఫంక్షన్ రావాలని ఆహ్వానించారు. నారాయణమూర్తి సినిమాకు గెస్ట్‌గా అంటే కొంత ఆఫ్‌బీట్‌గా అనిపించింది. ఆయన చేసే ఫంక్షన్‌కు పిలవడంతో నాకు కొంత ఆశ్చర్యం కలిగింది. ఓ మిత్రుడిగా నన్ను ఆహ్వానించడం హ్యాపీగా అనిపించింది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.