ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-12లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అరుదైన ఘనతను సొంత చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా హర్భజన్ చరిత్ర సృష్టించాడు. విశాఖ వేదికగా శుక్రవారం రాత్రి క్వాలిఫైయర్-2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ 150వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో 150 వికెట్ల క్లబ్‌లో హర్భజన్ చేరాడు.