ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో రబడ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. స్వల్ప గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రబడ ఆడలేదు. అయితే.. మే 30న ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రబడకు తగిన విశ్రాంతి అవసరం అని భావించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. అతనిని వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. బోర్డు ఆదేశాల మేరకు రబడ స్వదేశానికి వెళ్లనున్న కారణంగా పీఎల్‌కు దూరమయ్యాడు.