"He is so calculative that I would never question the last part of an innings with MS Dhoni. Yes, Bravo's got power but if MS has a feeling that he's going to win it this way, I'm going to back him every time," Fleming said at the media conference.
#IPL2019
#MSDhoni
#cskvsrcb
#StephenFleming
#royalchallengersbangalore
#chennaisuperkings
#delhicapitals
#rajasthanroyals
#cricket
సొంతగడ్డపై ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి బెంగళూరు గెలుపొందింది. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 26 పరుగులు అవసరం. బెంగళూరు పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఆ ఓవర్‌లో ఎంఎస్ ధోనీ వరుసగా 4, 6, 6, 2, 6 బౌండరీలు బాది 24 పరుగులు చేసాడు. అయితే చివరి బంతికి అవతలి ఎండ్‌లో ఉన్న శార్ధుల్ ఠాకూర్ రనౌట్ కావడంతో చెన్నై ఓటమిని ఎదుర్కొంది. చెన్నై మ్యాచ్‌ను కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోవడంతో ఇప్పుడు ధోనీపై విమర్శలు వస్తున్నాయి.
ధోనీ చివరి ఓవర్‌లో అద్భుతంగా ఆడినా.. 19వ ఓవర్‌లో మూడు సార్లు సింగిల్ తీసే అవకాశం వచ్చినా ధోనీ మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే ఆ సింగిల్స్ తీసి ఉంటే మ్యాచ్ చెన్నై వైపు ఉండేదేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అవతలి ఎండ్‌లో విధ్వంసక ఆటగాడు బ్రావో ఉన్నా కూడా ధోనీ సింగిల్స్ ఎందుకు తీయలేదని పలువురు విమర్శిస్తున్నారు.