Smriti Mandhana Rank's No.1 Batter In WODI Rankings | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-20

Views 48

Women's cricket is a little less favorable compared to men's cricket in India. Women's cricketers are still competing with men. However, in the latest ICC Women's rankings, female cricketer Smriti Mandhana topped the list.
#iccwodirankings
#smritimandhana
#mithaliraj
#iccrankings
#womenscricket
#jhulangoswami
#deeptisharm
#poonamyadav
#harmanpreetkaur

మన దేశంలో పురుషుల క్రికెట్ తో పోల్చుకుంటే మహిళల క్రికెట్‌కు కొంచెం ఆదరణ తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ మహిళా క్రికెటర్లు పురుషులతో పోటీ పడుతున్నారు. అయితే తాజాగా ప్రకటించిన ఐసీసీ మహిళా ర్యాంకింగ్స్‌లో మహిళా క్రికెటర్ స్మృతి మందనా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నది.

న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక శతకం సాధించడంతో పాటు... 90 పరుగులతో అజేయంగా నిలిచిన మంధానా సిరీస్ టాప్ స్కోరర్‌గా సత్తాచాటింది. దీంతో.. ఐసీసీ ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్లు పెర్రీ, మెక్ లానింగ్‌‌లను వెనక్కి నెట్టిన మంధాన.. ఏకంగా నెం.1 స్థానానికి ఎగబాకింది. గత ఏడాది 12 వన్డేలాడి 669 పరుగులు చేసిన మంధానాకి ఐసీసీ ‘వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డ్ లభించిన విషయం తెలిసిందే.

మహిళ క్రికెట్‌లో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీతీ కౌర్‌లకు ఎక్కువ పాపులారిటీ ఉంది. వీరి పేర్లు తెలియని వారు ఉండరు. అయితే వీరందరిని వెనుకకు నెట్టి స్మృతి మందనా అగ్ర స్థానంలో నిలవటం గమన్హారం. మహిళల ర్యాంకింగ్స్‌లో మిథాలీరాజ్ ఐదో స్థానంలో నిలవగా హర్మన్ ప్రీతీ కౌర్ టాప్-20లో నిలిచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS