Rishabh Pant has been added to the Indian T-20 squad that will play a 3-match T20 series against New Zealand. Pant would be looking to put an impressive show in the series.
#ShikharDhawan
#RishabhPant
#cricket
#Teamindia
#indiavsnewzealand
#indiavsnewzealandT-20series
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాకు రిషబ్ పంత్ విలువైన ఆటగాడని, మ్యాచ్ ఫలితాన్ని ఏ సమయంలోనైనా మార్చగల సామర్థ్యం రిషబ్‌కు ఉందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రిషబ్ పంత్‌కు ఐసీసీ 'ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఓ జాతీయ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పంత్‌పై పైవ్యాఖ్యలు చేశాడు.
"రిషబ్ పంత్ చాలా దూకుడైన ఆటగాడు. ఓవర్ వ్యవధిలోనే ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేయగల సత్తా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో రిషబ్ అద్భుతంగా రాణించి తన సత్తాను నిరూపించుకున్నాడు. వికెట్ కీపర్‌గా ధోని తర్వాతి స్థానం రిషబ్‌దే" అని ధావన్ చెప్పాడు.