గులాబీ పార్టీలో నివురు గ‌ప్పిన నిప్పులా అసంత్రుప్తులు.. !

Oneindia Telugu 2018-10-01

Views 339

In the trs party, the style of embarrassment turned out to be fire. Whenever the fire broke up the party, it became a question of anyone's question. Many ex-MLAs who have been disliked with the ticket are preparing for a revolt. Some people have already joined the Congress. But the leaders who believe that their political future will not be tampered with the ticket is still persistent. Deputy CM Kadiam Srihari, TRS Secretary General K. Kesha Rao is among them.
#trs
#trsparty
#ktr
#telangana
#telanganagovt
#kavitha
#kadiyamsrihari
#trs

గులాబీ పార్టీలో అసంత్రుప్తుల తీరు నివురుగ‌ప్పిన నిప్పులా ప‌రిణ‌మించింది. ఎప్పుడు అగ్నిగుండంగా మారి పార్టీని ద‌హించివేస్తుందో ఎవ్వ‌రి అంతుచిక్క‌ని ప్ర‌శ్నలా త‌యార‌య్యింది. ఇప్పటికే ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ కు గుడ్‌ బై చెప్పారు. త్వరలోనే ఓ ఎం.పి కూాడా రాజీనామా చేయనున్నారు. డజన్ల కొద్ది సీనియర్ నాయకులు అలక పాన్పు మీదున్నారు. ఇక టిక్కెట్ ఆశించి భంగపడిన అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ సారి టిక్కెట్ రాకపోతే తమ రాజకీయ భవిష్యత్తు గల్లంతు కావడం ఖాయమని నమ్ముతున్న నాయకులు మాత్రం పట్టుదలతో ఉన్నారు. ఈ సారి తమ వారసత్వానికి టిక్కెట్లు ఇప్పించుకొని నియోజకవర్గాలను కాపాడుకోవాలని భావించిన వారికి కేసీఆర్ హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటి వారిలో డిప్యూటీ సి.ఎం కడియం శ్రీహరి,టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ఉన్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS