Andhra Pradesh assembly session begun on Thursday morning. BJP MLAs came with umbrellas and raincoats.Ysrcp MLAs are not Attended for this time Assembly Sessions.
#chandrababunaidu
#ysjagan
#telugudesam
#ysrcongress
#bjp
#narendramodi
#andhrapradesh
#assembly
ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీకి బీజేపీ ప్రతినిధులు గొడుగులతో వచ్చి నిరసన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ లీకుల మయంగా ఉందని, చిన్నపాటి వర్షం కురిస్తే నీళ్లు కురుస్తున్నాయని విమర్శించారు. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చామన్నారు. రూ.1000 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజా ధనం దుర్వినియోగంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారన్నారు. చదరపు అడుగుకు రూ.10వేలు వెచ్చించి తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం చేయించిన ఘనత బాబుకే దక్కిందన్నారు.