Bhairava Geetha featuring Daali aka Dhananjay in the lead, has a new heroine Irra on board. The bilingual--in Kannada and Telugu- is directed by newcomer Siddhartha. The film is produced by Ram Gopal Varma in association with Bhaskar.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో బాగా పొగిడేస్తున్న చిత్రం భైరవగీత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సిద్ధార్థ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం గురించి, నటిస్తున్న హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు కురిపించడంతో భైరవ గీత చిత్రంపై ఆసక్తి పెరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
భైరవ గీత సినిమాను భాస్కర్ అనే ఔత్సాహిక నిర్మాతతో కలిసి రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్నాడు. భూస్వాములకు, పేదవర్గాలకు జరిగే పోరాటంలో ఓ వ్యక్తి ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది చిత్ర కథ. వర్మ మార్కు చిత్రంగా హింసాత్మకంగా సాగుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
#BhairavaGeetha
#DaaliakaDhananjay
#irra
#siddhartha
#dhananjay
#RamGopalVarma