Srinivasa Kalyanam Movie Celebrity Review. Directors response after watching movie
నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. తెలుగు సంప్రదాయ వివాహాల ప్రాముఖ్యతని తెలియజేసే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెలెబ్రిటీల కోసం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం స్పెషల్ షో వేయించారు. ప్రముఖ దర్శకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
నేను లోకల్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన స్పెషల్ షో అనంతరం శ్రీనివాస కళ్యాణం చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ చిత్రం చూశాక పదేళ్ల క్రితం జరిగిన తన వివాహం తనకు గుర్తుకు వచ్చిందని త్రినాథ్ రావు అన్నారు. శ్రీనివాస కళ్యాణం లో చూపించిన చాలా అంశాలు తన పెళ్ళిలో కూడా జరిగిఉంటే బావుండేది అని తెలిపాడు.
ఈ చిత్రాన్ని చూసిన ప్రతి దర్శకుడు క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నితిన్ మధ్య జరిగే సంభాషణ అద్భుతంగా ఉన్నట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశంలో సంభాషణ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.