Aadi New Movie Was Launched By Vamsi Paidipally

Filmibeat Telugu 2018-05-28

Views 106

Aadi is coming up with another love story. The film to be directed by Srinivasa Naidu Nadikatla has been launched today at Film Nagar temple with Vamsi Paidipally giving the first clap.

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో రాబోతున్న నూతన చిత్రం ఆదివారం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. కెమెరా స్విచ్ డీసీపీ.కృష్ణ మోహన్ చెయ్యడం జరిగింది. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. ఈ చిత్రానికి చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హీరో నాగశౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ పాల్గొన్నారు.
అనంతరం హీరో ఆది మాట్లాడుతూ.. ''డైరెక్టర్ నాకు 3 గంటలు నెరేషన్ ఇచ్చారు. ఫ్యూర్ లవ్ స్టొరీ ఇది. మంచి ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. త్వరలో హీరోయిన్ పేరు ప్రకటిస్తాము. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాను. నాకు కెరీర్‌లో ఇది మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. ''క్లాప్ వంశి పైడిపల్లి చెయ్యడం జరిగింది. మంచి లవ్ స్టొరీతో వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా చెయ్యడానికి మాకు సహకరిస్తున్న సాయి కుమార్ గారికి, హీరో ఆదికి, నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు సంభందించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాము. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు'' అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS