మనం ఎన్నో మనస్సును కదిలించే కథనాలు చదివి ఉంటాం. కొందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రతిభనే శ్వాసగా బతికి విజయం సాధించిన వారూ ఉంటారు. ఫేస్ బుక్ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాగే గంగమ్మకూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆమె పాడిన ఒక పాటను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే 6 గంటల్లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
గంగమ్మ జీవితంలో పడ్డ కష్టాలు, ఆమె కుటుంబ పరిస్థితి, ఎలా తన లైఫ్ టర్న్ అయ్యింది, ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్స్ ఇలా అన్నీ బోల్డ్ స్కై కి ప్రత్యేకంగా వివరించింది.