Anchor Rashmi Speech @Anthaku Minchi Movie Trailer Launch

Filmibeat Telugu 2018-08-06

Views 3

Anchor Rashmi Gautham Speech at Anthaku Minchi Movie Trailer Launch. The makers of the Rashi Gautham starrer, ‘Anthaku Minchi’ have announced that the film will release on August 24.
రష్మి నటించిన 'అంతకు మించి' మూవీ ఆగస్టు 24న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రష్మి మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఫిల్మ్ నగర్లో 'అంతకు మించి' పోస్టర్ చూసినపుడు అందులో రష్మి తొడలు, వెనకల సముద్రం సీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది అంటూ వ్యాఖ్యానించారు. దర్శకుడి కామెంట్లపై రష్మి తనదైన శైలిలో స్పందించారు.
అజయ్ భూపతి కామెంట్లపై రష్మి రియాక్ట్ అవుతూ... మా సినిమా క్రాష్ ప్రమోషన్స్ చేయడంతో పాటు పోస్టర్‌తో కనెక్ట్ అయినందుకు థాంక్స్. మీ ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోలేను.... అంటూ సమాధానం ఇచ్చింది.
ఒక సినిమా అనేది కేవలం ఒకరి కష్టం కాదు. అందరూ కలిసి కష్టపడితేనే ఇది సాధ్యం అవుతుంది. దాని వెనక రాత్రింభవళ్లు ఎంతో మంది హార్డ్ వర్క్ ఉంటుంది. మేము ఈ సినిమా పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది. డబ్బు ఖర్చు పెట్టే నిర్మాతలపై ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసు. ఈ రోజు ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే నిర్మాతల ముఖంలో సంతోషం కనిపిస్తోంది... అని రష్మి వ్యాఖ్యానించారు.

Share This Video


Download

  
Report form