RX 100 Movie Director Ajay Bhupathi About To Join With Nithin

Filmibeat Telugu 2018-07-18

Views 747

‘RX 100‘ became a blockbuster among the small films released this year and it is quite obvious that the director is in demand right now for his next projects. Film nagar source said that, Ajay Bhupathi next movie with Nithin.
#RX100
#AjayBhupathi
#Nithin

'ఆర్ఎక్స్ 100' సినిమా విడుదల తర్వాత దర్శకుడు అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి డిమాండ్ ఏర్పడింది. తొలి సినిమాలో రొమాంటిక్ సీన్లను అతడు హ్యాండిల్ చేసిన విధానం.... బోల్డ్ సీన్లను పచ్చిగా ప్రజంట్ చేస్తూనే అసభ్యత లేకుండా తెరపై చూపించిన అతడి టాలెంట్‌ను అందరూ అభినందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అజయ్ భూపతి తన రెండో సినిమాను హీరో నితిన్‌తో చేయబోతున్నట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాత, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి.... అజయ్ భూపతితో ఇప్పటికే సంప్రదింపులు జరిపాడని, నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే కథ కూడా ఉండటంతో డీల్ ఓకే అయినట్లు తెలుస్తోంది. అయితే సినిమా ప్రారంభం అయ్యే వరకు దర్శకుడి పేరు బయట పెట్టకుండా సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నాడ సుధాకర్ రెడ్డి.
తాను యూత్‌ను టార్గెట్ చేసే సినిమాలు చేస్తానని... ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించే డ్రామాలు చేయబోనని ఇటీవల ఇంటర్వ్యూలో అజయ్ భూపతి తెలిపారు. దీన్ని బట్టి తన రెండో సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిన్ సన్నివేశాలు తప్పకుండా ఉండేలా అజయ్ భూపతి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form