టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డుపై పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ కన్నేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ఐదు వన్డేల సిరిస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో ఈ పాకిస్తాన్ ఓపెనర్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ(210 నాటౌట్) సాధించాడు.దీంతో పాక్ తరుపున తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా విరాట్ కోహ్లీ రికార్డుపై ఫకార్ జమాన్ కన్నేశాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే వన్డేల్లో అత్యంత వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించడం. ఇప్పటి వరకు 17 వన్డే మ్యాచ్‌లాడిన ఫకార్ 17 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 980 పరుగులు సాధించాడు.
Pak opener Fakhar Zaman, who scored a scintillating and an unbeaten 156-ball 210 to become the first Pak batsman to score a double ton, now stands 20 runs short of overhauling Virat Kohli and Viv Richards in fastest to 1000 ODI runs.
#fakharzaman
#viratkohli
#vivrichards
#1000odiruns