ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో భారత జట్టు ఎంపికపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటివ్వకపోవడంపై టీమిండియా క్రికెట్ దిగ్గజాలైన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పెదవి విరచగా.. తాజాగా జట్టు ఎంపిక తీరును విమర్శిస్తూ మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా వార్తల్లోకొచ్చాడు.విదేశీ పర్యటనకు ముందు టీమిండియా అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌లో ఆడింది. ఈ మ్యాచ్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానెకి.. వన్డే జట్టులో చోటివ్వకపోవడంపై పెదవి విరిస్తూ.. అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేసినట్లు ఉందని ఈ మాజీ సెలక్టర్ వివరించాడు.
After former Indian skipper Sourav Ganguly, veteran cricketer and past chairman of selectors committee Dilip Vengsarkar has slammed Indian team management for not backing Mr Dependable Ajinkya Rahane and wicket-keeper batsman Lokesh Rahul.
#india
#dilipvengsarkar
#england
#indiainengland2018