Responding to Prabhas-Anushka marriage rumours, Anushka Shetty mother Prafulla Shetty said, “They both are stars and have acted together. I would love to get Prabhas like Mr. Perfect for Anushka but they are just good friends. Stop spreading rumors about their marriage.”
#PrabhasAnushka
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా ఇటు మీడియాలో, అటు అభిమానులు, ప్రేక్షకుల్లో చర్చ సాగుతోంది. కొన్ని రోజుల క్రితం ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రభాస్, అనుష్కతో పాటు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సైతం ఈ వార్తల్లో నిజం లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తేల్చి చెప్పారు. ఎన్ని సార్లు ఖండించినా మళ్లీ మళ్లీ ఈ రూమర్స్ ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి ఓ క్లారిటీ ఇచ్చారు.
ఒక తల్లిగా తన కూతురు అనుష్కకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్న ప్రఫుల్లా వెట్టి ఆలయాల్లో పూజలు సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం మీడియాకుచిక్కాయి.