Mohammed Shami Summoned Kolkata Police Over Cheque Bounce

Oneindia Telugu 2018-07-19

Views 23

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఫిర్యాదుతో షమీకి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. సెప్టెంబర్‌ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అలీపూర్‌ కోర్టు క్రికెటర్‌ను ఆదేశించింది.గత మార్చి నెలలో షమీ తన భార్య హసీన్‌ జహాన్‌‌కు రూ. లక్ష చెక్కు ఇచ్చాడు. తనకు షమీ ఇచ్చిన లక్ష రూపాయల చెక్‌ (నెంబర్‌ 03718) బౌన్స్‌ అయిందని హసీన్‌ జహాన్‌ ఫిర్యాదు చేసింది. ఈ చెక్ బౌన్స్ కేసును విచారించిన అలీపూర్‌ కోర్ట్‌ సెప్టెంబర్‌ 20న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Share This Video


Download

  
Report form