Alishba said that I am a frequent flyer to Dubai because my sister stays in Sharjah. As a person, I really like Shami. As any fan that has idolised a celebrity, they always dream of meeting their idol. I had the desire to meet (Shami) like any other fan would want to, which I don’t think is a big deal,” she added.
షమీపై వరుస ఆరోపణలు చేసిన అతని భార్య క్రమంగా బలహీనపడుతోంది. టీమిండియా పేసర్ మహమ్మద్ షమి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, పాకిస్థాన్‌కు చెందిన అలీబ్‌షా అనే అమ్మాయి నుంచి డబ్బులు తీసుకున్నాడని షమి భార్య హసీన్ జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అలీబ్‌షా మీడియాతో మాట్లాడింది.
'నేను ఇన్‌స్టాగ్రాంలో షమి ఫాలోవర్లలో ఒకర్ని. అతనికున్న లక్షలాది అభిమానుల్లో ఒకదాన్ని. గత ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం నేను మొదటిసారి షమికి మెసేజ్ చేశాను. దుబాయ్‌లో మేమిద్దరం కలిసి రూమ్ తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. షమిని దుబాయ్‌లో కలిసింది నిజమే. కానీ, ఇదో సాధారణమైన మీటింగ్. ఆ రోజు షమిని కలిసేందుకు నేను నా సోదరి ఇంటి నుంచి నేరుగా హోటల్‌కి వచ్చాను. షార్జాలో నా సోదరి ఉంటుంది' అని వివరించింది.
'అక్కడి నుంచే వచ్చాను. షమి దుబాయ్ వచ్చిన మరుసరి రోజు ఉదయం సుమారు 9గంటల ప్రాంతంలో అతడితో కలిసి నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అంతేకానీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదు. అబద్దాలు చెప్పే అలవాటు లేని ఓ వ్యక్తి దేశానికి ద్రోహం చేస్తాడని ఎలా అనుకుంటున్నారు. ఎక్కడికి వచ్చి ఈ విషయం చెప్పమన్నా ధైర్యంగా చెబుతా. ఎవరికీ భయపడేది లేదు' అని అలీబ్‌షా తెలిపింది.
నిజాలు తేలాలని పూనుకున్న బీసీసీఐ ఒక్కొక్కరిని విచారిస్తోంది. ఆదివారం జరిగిన విచారణలో షమీ భార్య కొన్ని ప్రశ్నలకు మౌనం వహించింది.