Actress Vidya Balan is all set to make her debut in Tollywood. Much-anticipated biopic of NTR, which has Balakrishna playing the role of his father. Vidya Balan said, "People know Basavatarakam as NTR's wife, but she was not really a public figure. People knew of her but they didn't know her. That was interesting for me as an actor."
#NTRbiopic
#VidyaBalan
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా బాలీవుడ్ నటి విద్యా బాలన్ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ సతీమణి బాసవతారకం పాత్రను ఆమె పోషిస్తున్నారు. ఈ పాత్రలో విద్యాబాలన్‌ను నటింపజేసేందుకు బాలకృష్ణ స్వయంగా ముంబై వెళ్లి ఆమను ఒప్పించారు కూడా. పాత్ర ఔచిత్యం గురించి తెలుసుకొన్న ఆమె బవసతారకం పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఎన్టీఆర్ బయోపిక్‌లోని బసవతారకం పాత్రపై విద్యాబాలన్ ఇటీవల స్పందించారు. ఎన్టీఆర్ భార్యగానే బసవతారకం అందరికి తెలుసు. కానీ ప్రజాదరణ పొందిన వ్యక్తి కాకుండా కేవలం గృహిణి మాత్రమే. కానీ ఆ పాత్రలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి అని విద్యాబాలన్ పేర్కొన్నారు.