Bio Pics Flow In Film Industries సినీపరిశ్రమాల్లో బయోపిక్ ల హవా

Oneindia Telugu 2018-07-14

Views 113

Film Industries Started to do films on bio pics

టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ ఇలా అన్ని భాషల చిత్రసీమ బయోపిక్ లతో హోరేత్తిపోతోంది. దేశవ్యాప్తంగాను - అంతర్జాతీయ స్దాయిలోను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రసిద్దుల జీవితగాథలను వెండతెరకెక్కిస్తున్నారు. వీటిలో రాజకీయ నాయకులు - క్రీడాకారులు - సినీ నటినటుల జీవిత చరిత్రలు ఉండడం విశేషం. మహానటి సావిత్రి పై ఇటీవలే విడుదల చేసిన మహానటి చిత్రం సూపర్ హిట్ కొట్టింది. అంతకు ముందు ‍భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై బాలీవుడ్ లో ఓ బయోపిక్ వచ్చింది. ఆ చిత్రం ఇతర భాషలలోకి కూడా అనువాదమై విజయం సాధించింది.
తెలుగు - తమిళ భాషలలో తీసిన మహానటి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహానటుడు - తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్.టి. రామరావు జీవితం పై ఎన్.టి.ఆర్ పేరుతో ఆయన కుమారుడు నటుడు - ఎంఎల్ ఎ బాలక్రిష్ణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకులు క్రిష్. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలక్రిష్ణే నటిస్నున్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ప్రముఖ మహిళా క్రికెటర్ - భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిధాలి రాజ్ బయోపిక్ ను వచ్చే సంవత్సరం తీయనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS