IPL 2018 : KKR vs CSK MS Dhoni s Daughter Ziva Shahrukh Khan Pose For Cute Pics

Oneindia Telugu 2018-04-11

Views 243

It was a clash of the titans as MS Dhoni’s Chennai Super Kings and Shah Rukh Khan’s Kolkata Knight Riders battled it out on the field in the IPL match on Tuesday evening. But looks like Shah Rukh made a new friend while cheering for his team from the stands.

చెపాక్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఒకవైపు సిక్సర్ల వర్షం, మరొకవైపు గ్యాలరీలో ధోనీ కూతురు జీవా చేసిన సందడి.. ఇలా చెన్నై సూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఈ దృశ్యాలు క్రికెట్‌ అభిమానులను ఎంతో అలరించాయి.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని భార్య సాక్షి, కూతురు జీవా హాజరయ్యారు. పసుపు రంగు దుస్తుల్లో కనిపించిన వీరిద్దరూ చెన్నై జట్టుకు మద్దతు తెలిపారు. అనంతరం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని షారుక్‌ ఖాన్‌.. జీవాతో కలిసి సందడి చేస్తూ కనిపించాడు.
కోల్‌కతాపై చెన్నై గెలుపు అనంతరం సంబరాలు జరుపుకుంటున్న జీవాను దగ్గరకు తీసుకున్న షారుక్ సెల్ఫీ దిగాడు. ఈ ఇద్దరూ కలిసి మ్యాచ్‌లో ప్రధానాకర్షణగా నిలిచారు. కోల్‌కతా ఓటమి తర్వాత కూడా కూల్‌గా కనిపించిన షారుక్ జీవాతో ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియలో వైరల్‌ అయింది.
‘జీవాతో షారుక్‌ అల్లరి చూడండి, జీవాను చూసి షారుక్‌ చిన్నపిల్లాడిలా మారిపోయాడు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గత ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌కి షారుక్‌ తన కుటుంబసభ్యులతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కూతురు సుహానాతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS