బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'సంజు' బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని తేలి పోయంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 300 కోట్లు వసూలు చేయడంతో పాటు వీకెండ్, వీక్ డేస్ అనే తేడా లేకుండా బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్‌రన్‌లో బాలీవుడ్లో చాలా కాలంగా పాతుకుపోయిన పలు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
సంజు' మూవీకి ఇంత ఆదరణ లభించడానికి ప్రధాన కారణం సంజయ్ దత్ జీవితంలో అసలు ఏం జరిగింది? ఆయన చుట్టూ ఉన్న వివాదాలు, కేసుల వెనక అసలు కారణాలు ఏమిటి? అనే ఆసక్తి ప్రజల్లో ఉండటమే. వారిలో ఉన్న క్యూరిసిటీకి తోడు... రణబీర్ ఉత్తమ నటన, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ బయోపిక్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో బాక్సాఫీస్ షేక్ అవుతోంది.
ఇది సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇది ఆయన సొంత కథ. ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే ఆయన కథ తమ సినిమాకు వాడుకున్నందుకు నిర్మాతలు రూ. 10 కోట్ల ఆఫర్ చేశారట. దీంతో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో షేర్ కూడా ఇవ్వబోతున్నారట.
Bollywood star Sanjay Dutt's biopic 'Sanju' turned out to be a blockbuster at the box office. Sanjay Dutt has been offered Rs.10 crores for the story and they have offered a share in the profits. Sanjay is celebrating the success of his biopic and vacationing in Singapore with his wife Maanyata, kids Shahran and Iqra.
#SanjayDutt
#Maanyata