Sanjay Dutt Talks About His Love Matter

Filmibeat Telugu 2018-05-31

Views 3

Sanjay Dutt affair with Madhuri Dixit that became the talk of the town in the early 90s.

సంజూ బయోపిక్ ట్రైలర్ రిలీజైన తర్వాత బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అఫైర్ల విషయం మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ట్రైలర్‌లో 'ఇప్పటి వరకు ఎంత మందితో పడుకున్నావు? అనే ప్రశ్నకు వేశ్యలను మినహాయించి 308 మందితో' అని సంజయ్ దత్ పాత్ర చేసిన రణ్‌బీర్ కపూర్ చేత చెప్పించారు. అంటే సంజయ్ దత్‌తో ఎంత మంది అమ్మాయిలతో సంబంధం ఉందో ఓ సారి ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సంజయ్ దత్, మాధూరీ దీక్షిత్ లవ్‌ స్టోరీ తాజాగా మీడియాలో చర్చనీయాంశమైంది.
1993లో సంజయ్, మాధురీ దీక్షిత్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ సినీ పత్రికల పతాక శీర్షికలను ఆకర్షించాయి. సాజన్, ఖల్‌నాయక్ చిత్రాల్లో వారిద్దరూ సంజూ, మాధురీ కలిసి నటించిన తర్వాత వారిద్దరి జోడి చాలా ఫేమస్ అయింది. ఆ సమయంలో వారిద్దరూ పెళ్లి చేసుకొంటారనే వార్తలు వైరల్‌గా మారాయి.
సంజయ్ దత్ అనూహ్యంగా టాడా కేసులో అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు యూటర్న్ తీసుకొన్నాయి. బాలీవుడ్‌లో తాను దగ్గరనుకొన్నవాళ్లంతా దూరమయ్యారు. అలాగే మాధూరి దీక్షిత్ ముఖం చాటేసింది. ఆ తర్వాత అనేక మార్లు సంజయ్‌తో డేటింగ్ చేయలేదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని మాధురీ దీక్షిత్ వెల్లడించింది.
సంజయ్ జైలు నుంచి రిలీజైన తర్వాత మాధురీ‌తో కలువడానికి ఇష్టపడలేదు. అలాగే సంజయ్ కూడా ముఖం చూపించకుండా తప్పించుకొన్నారనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. తన పెళ్లయ్యేంత వరకు సంజయ్‌తో అఫైర్ గురించి మాధురీ దీక్షిత్ పెదవి విప్పలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. అయితే మాధురీ దీక్షిత్‌పై సంజయ్ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని పలు సందర్భాల్లో అర్దమైంది.

Share This Video


Download

  
Report form