బాలీవుడ్‌లో వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సంజు చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు భారీ కలెక్షన్లను సాధిస్తూ దూసుకెళ్తున్నది. సినీ ప్రముఖులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా సంజు చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. కానీ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత సంజయ్ దత్ కూతురు త్రిషాల మాత్రం తండ్రిపై కారాలు మిరియాలు నూరుతున్నదట..
జైలుశిక్ష నుంచి విముక్తుడయ్యాక సంజయ్ సినీ జీవితం గాడిలో పడుతున్నది. భూమి చిత్రం ద్వారా మళ్లీ బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా తండ్రికి త్రిషాల ప్రత్యేకంగా ఓ సందేశాన్ని పంపి అభినందనలు తెలిపింది. సోషల్ మీడియా ద్వారా పంపిన సందేశం, ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.
కానీ సంజు విషయంలో మాత్రం త్రిషాలా కోపంతో ఉన్నారట. అందుకు కారణం ఆ చిత్రంలో మాన్యతా దత్, ఇద్దరు పిల్లలు ఇక్రా, షారాన్ గురించి మాత్రమే చూపించడం త్రిషాలాకు నచ్చలేదట. సంజయ్ జీవితంలో వారికే దర్శకుడు ప్రధాన్యం ఇవ్వడం ఆమెకు నచ్చకపోవడంతో గుంభనంగా ఉండిపోయారట.