రంగస్థలం చిత్రాన్ని అనుష్క భాగమతి చిత్రం అధికమించింది. మీరు వింటున్నది నిజమే. కానీ ఇది మంచి రికార్డు కాదు. ఛండాలమైన రికార్డు ఇది. ఇంతకీ ఆ రికార్డు ఏ విషయంలో అనుకుంటున్నారా.. పైరసీలో. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఎక్కువ మంది పైరసీలో చూసిన చిత్రంగా భాగమతి రికార్డు సృష్టించింది. ఆ తరువాత స్థానంలో రాంచరణ్ రంగస్థలం నిలిచింది. జర్మనీకి చెందిన తెసీక్సిపికో అనే సంస్థ తెలుగులో ఎక్కువగా పైరసీ బారిన పడ్డ చిత్రాల జాబితా విడుదల చేసింది. తొలి పది స్థానాలని ఆక్రమించిన తెలుగు చిత్రాలు.. ఎంత మంది వాటిని పైరసీలో చూశారు తదితర వివరాలు ఇవే..
భాగమతి చిత్రం పైరసీ రూపంలో 1.9 మిలియన్ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది పైరసీలో భాగమతిదే అగ్రస్థానం.
పైరసీలో రంగస్థలం భాగమతి తరువాత రెండవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రాన్ని 1.6 మిలియన్ మంది పైరసీలో డౌన్ లోడ్ చేసుకున్నారు.
భరత్ అనే నేను చిత్రం కూడా 1.6 మిలియన్స్ డౌన్ లోడ్స్ పైరసీలో వచ్చాయి.
మహానటి చిత్రాన్ని పైరసీలో 1. 4 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
నాపేరు సూర్య చిత్రానికి 1.2 మిలియన్ డౌన్ లోడ్స్ పైరసీలో జరిగాయి.
Anushka Shetty's Bhaagamathie becomes the most downloaded movie. 2nd place for Rangasthalam.