Mahesh Babu tweets on Rangasthalam goes viral. Mahesh Praises Ram Charan and Samantha acting.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. రంగస్థలం చిత్రం టాలీవుడ్ రికార్డులన్నింటిని తుడిచిపెట్టేస్తూ బాహుబలి తరువాత అత్యథిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా అవతరించింది. ఇప్పటికీ రంగస్థలం చిత్ర వసూళ్లు సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్నాయి.
అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రాల్లో రంగస్థలం చిత్రం బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది. వారం దాటాక కూడా ఈ చిత్రానికి బలమైన కలెక్షన్లు వస్తున్నాయి. రెండవ వీకెండ్ లో ఇంకాస్త పుంజుకుంటే 100 కోట్ల షేర్ సాధ్యం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ చిత్రంలో చిట్టిబాబుగా రాంచరణ్ కనబరిచిన నటన అమోఘం. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రాంచరణ్ నటించిన తీరు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించింది.
రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో నటన పరంగా, వసూళ్ల పరంగా ది బెస్ట్ మూవీ గా నిలిచింది. చరణ్ నటనపై ఎన్టీఆర్, రానా, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించారు.
తాజా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించాడు. ట్విటర్ వేదికగా స్పందించిన మహేష్ బాబు రంగస్థలం రాంచరణ్, సమంతపై ప్రశంసలు కురిపించాడు. రాంచరణ్, సమంత అద్భుతమైన నటన కనబరిచారని మహేష్ బాబు అన్నారు.