Team India began their tour of the United Kingdom with a 78-run thrashing of Ireland in the first Twenty20 international in Dublin on Wednesday. Virat Kohli believes that a flexible batting order will help keep India's opponents guessing while they are in Ireland and England.
#viratkohli
#india
#ireland
#teamindia
#Dhoni
అంతా ఊహించినట్లుగానే కోహ్లీసేన ఐర్లాండ్‌పై విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టించిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తూ.. చివరికి విజయాన్ని సాధించింది. అయితే ఈ విషయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీని అడగ్గా.. ఐర్లాండ్‌తో రెండో టీ20తో పాటు ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులుంటాయని స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఐర్లాండ్ చివరి ఓవర్ చాలా బాగా వేసింది. రోహిత్, ధావన్ కారణంగానే భారత్ మంచి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ధోనీ, రైనా, పాండ్య దూకుడుగా ఆడారు. ఇక బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందరూ చాగా రాణించారు' అని తెలిపాడు.