Thippara Meesam movie is a action thriller directed by Asura fame Krishna Vijay.Sree Vishnu playing the main lead role in this movie
#SreeVishnu
నీది నాది ఒకే కథ చిత్రాల్లో మధ్య తరగతి యువకుడిగా సహజనటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శ్రీవిష్ణు తాజాగా ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. కృష్ణ విజయ్ దర్శకుడు. రిజ్వాన్ నిర్మాత. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కెమెరా స్విఛాన్ చేశారు.
హీరో నారా రోహిత్ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ మూసధోరణికి భిన్నమైన చిత్రమిది. వినూత్న ప్రయత్నంగా అందరిని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. గడ్డం, పొడవాటి మీసకట్టుతో శ్రీవిష్ణు పాత్ర వైవిధ్యంగా సాగుతుందని, జూలైలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: సిద్, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల.