Bigg Boss housemates tonight. Bigg Boss became interesting day by day
తన వల్ల బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న లేడీస్ ఇబ్బంది పడున్నారంటూ స్టేట్ మెంట్ ఇచ్చావని.. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారో చెప్పాలంటూ కిరీటితో కౌశిక్ చెడుగుడు ఆడేశాడు . అయితే కిరీటి అసలు విషయం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేసినప్పటికీ కౌశిక్ వదల్లేదు. ముందు నువ్ నాపై చేసిన ఆరోపణని నిరూపించాలని గట్టిగా అడగటంతో భాను శ్రీ, దీప్తి సునైనా, తేజస్వి నీ వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు కిరీటి. దీంతో ఆ ముగ్గురు మాకు ఏం ఇబ్బంది లేదు అనటంతో కిరిటీని కొట్టేంత పనిచేశాడు కౌశిక్.
నీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కిరీటి పైకి దూసుకువచ్చాడు కౌశిక్. నూతన్ నాయుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు కౌశిక్. తాను చేసిన తప్పుకు సారి చెప్పలని లేదంటే ఊరుకోను అని గట్టిగా హెచ్చరించడంతో దిక్కులేని పరిస్థితిలో కౌశిక్‌కి పీస్ బ్రో కిరీటి దామరాజు. ఇక ఈ పరిస్థితి మొత్తాన్ని స్మోకింగ్ రూం లో నుండి గమనిస్తున్న తనీష్ సైలెంట్‌గా ఉండిపోయారు.